Hyderabad, ఫిబ్రవరి 21 -- ఒకప్పుడు కేవలం తెల్ల జుట్టును దాచుకోవడానికి మాత్రమే వెంట్రుకలకు నల్ల రంగును వేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. జుట్టుకు రంగు వేయడం ఇప్పుడు ట్రెండ్ అయింది. గ్రే హెయిర్‌ను దాచుకోవడానికి మాత్రమే కాకుండా కొత్త లుక్ కోసం, స్టైల్ గా కనిపించడం కోసం రకరకాల రంగులను వేసుకుంటున్నారు. చూడటానికి కాస్త ట్రెండీగా, స్టైల్‌గా అనిపించినప్పటికీ జుట్టుకు ఇలా రంగులు వేసుకోవడం ప్రమాదకరమనే చెప్పాలి.

ఎలాంటి అవసరం లేకుండానే తొందరపడి హెయిర్ కలర్ వేయించుకుంటే, ఆలోచించకుండా దీన్ని మీ అలవాటుగా మార్చుకుంటే ఇది మీ జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒకవేళ మీకు హెయిర్ కలర్ వేయించుకోవడం చాలా ఇష్టమైతే జుట్టు దెబ్బతినకుండా ఉండేందుకు, చర్మంపై రంగు మచ్చలు పడకుండా ఉండేందుకు రంగు వేసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నార...