Hyderabad, మార్చి 2 -- తల్లిపాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. పిల్లల శారీరక ఎదుగదల నుంచి మానసిక వృద్ధి వరకూ తల్లిపాలు కీలక పాత్ర పోషిస్తాయి. కానీ ప్రస్తుతం చాలా మంది తల్లులు పాల ఉత్పత్తి సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నారు. పిల్లలకు ఆరోగ్యాన్నిచ్చే పాలను పెంచుకునేందుకు ఏం చేయాలో అర్థం కాక భాదపడుతున్నారు. బిడ్డకు సరిపడా పాలు ఇవ్వడం లేదనే అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. దీని నుంచి బయటపడేందుకు మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

పాలిచ్చే తల్లులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, పాలు ఇస్తుంటేనే పెరుగుతుంటాయి. ప్రత్యేకించి బిడ్డ పుట్టిన కొత్తలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. మీ బిడ్డకు ఆకలి అనిపించినప్పుడల్లా పాలు ఇవ్వడానికే ట్రై చేయండి. ఒక రొమ్ములో పాలు రావడం లేదంటే మరో రొమ్ముతో ఇచ్చేందుకు ట్రై చేయండి.

చాల...