భారతదేశం, ఫిబ్రవరి 27 -- Time Travel OTT: టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందిన తెలుగు మూవీ రివైండ్ థియేట‌ర్ల‌లో రిలీజైన నాలుగు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. మార్చి 7 నుంచి ల‌య‌న్స్ గేట్ ప్లే ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ థ్రిల్ల‌ర్ మూవీ రిలీజ్ డేట్‌ను ల‌య‌న్స్ గేట్ ప్లే ఓటీటీ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది.

రివైండ్ మూవీలో సాయి రోన‌క్, అమృత చౌదరి హీరోహీరోయిన్లుగా న‌టించారు. క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ సినిమాను నిర్మించాడు. సీనియ‌ర్ యాక్ట‌ర్ సురేష్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కు ల‌వ్‌స్టోరీ, ఫాద‌ర్ అండ్ స‌న్ సెంటిమెంట్‌ను జోడించి ఈ మూవీని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్‌. కాన్సెప్ట్ కొత్త‌గా ఉన్నా...డైరెక్ట‌ర్ అనుభ‌వ‌లేమి కార‌ణంగా తెలు...