భారతదేశం, జనవరి 30 -- పాకిస్థాన్‌లో ఓ షాకింగ్ కేసు వెలుగుచూసింది. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన ఓ పాకిస్థానీ వ్యక్తి తన 15 ఏళ్ల కుమార్తెను కాల్చి చంపాడు. ఇటీవలే వీరి కుటుంబం బలూచిస్థాన్ తిరిగి వచ్చింది. నిందితుడైన తండ్రి తన నేరాన్ని అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు. తన కుమార్తె చేస్తున్న టిక్‌టాక్ వీడియోలతో కలత చెందానని నిందితుడు చెప్పాడు. కూతురు వీడియోలు చేసేందుకు పొట్టి బట్టలు వేసుకునేదని పేర్కొన్నాడు. సమాజంలో పరువు పోతుందనే భయంతో ఆవేశంతో ఈ దారుణానికి పాల్పడ్డానని ఒప్పుకొన్నాడు.

దాదాపు 25 సంవత్సరాలుగా యునైటెడ్ స్టేట్స్‌లో నివసించిన అన్వర్ ఉల్-హక్ కుటుంబం ఇటీవలే పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌కు వచ్చింది. మంగళవారం క్వెట్టాలోని ఒక వీధిలో కాల్పులు జరిగాయి. మెుదట్లో తండ్రి అన్వర్ గుర్తుతెలియని ముష్కరులు అమెరికాలో జన్మించిన తన 1...