Hyderabad, మార్చి 2 -- బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, జాకీ ష్రాఫ్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కండల వీరుడు, ఫిట్‌నెస్ అనే పేర్లతో ఫ్యామస్ అయిపోయాడు. 34వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయన ఫిట్‌నెస్ కోసం కేవలం ఎక్సర్‌సైజులు మాత్రమే చేస్తూ కూర్చోడట. 2019లో జీక్యూ ఇండియాతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో, తన వెయిట్ ను ఎలా మెయింటైన్ చేస్తున్నాడో వివరించాడు. ఆయన చేసే వ్యాయామాలలో మార్షల్ ఆర్ట్స్, పార్కౌర్ వెయిట్ ట్రైనింగ్ కూడా ఉంటాయట. ఇవే కాకుండా, ఫిట్‌నెస్ కోసం గ్యాప్ లేకుండా శ్రమించే టైగర్ ష్రాఫ్ ఇంకేం చేస్తాడో తెలుసుకుందామా?

టైగర్.. ఫిట్‌నెస్ రొటీన్‌లో భాగంగా జిమ్నాస్టిక్స్ ట్రైనింగ్, ఉదయం ట్రెడ్‌మిల్‌పై నడవడం లేదా డాన్స్ చేయడం వంటివి ఉన్నాయి. ఆయన రెగ్యూలర్ గా చేసే 3 ప్రధాన వ్యాయామాలలొ 'డెడ్‌లిఫ్ట్, ఫ్రీ వెయిట్ స్క్వాట్, బెంచ్ ప్రెస్' ఉంటాయట.

రోజువారీ ...