భారతదేశం, మార్చి 10 -- Tiger In Peddapalli: పెద్దపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తుంది. కొమురం భీం ఆసిఫాబాద్ అటవీప్రాంతంలో ఉండే పెద్దపులి మంచిర్యాల జిల్లా చెన్నూరు మీదుగా గోదావరినది దాటి మంథని మండలం బిట్టుపల్లి మీదుగా భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ అటవీ ప్రాంతం వైపు వెళ్ళినట్లు పాదముద్రల అనవాళ్ళు లభించాయి.

పెద్దపల్లి జిల్లాలోని బిట్టు పల్లి వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా పెద్దపులిని రైతులు చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీశాఖ అధికారులతోపాటు పోలీసులు అక్కడికి చేరుకుని పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. ఆడ పెద్దపులి గా భావిస్తు మగ పెద్దపులి తోడు కోసం ఆసిఫాబాద్ అడవుల నుంచి బయలుదేరినట్లు భావిస్తున్నారు.

మంథని, మహదేవ్ పూర్, భూపాలపల్లి అటవీ ప్రాంతం నుంచి ములుగు జిల్లా ఏటూరునాగారం అడవుల వరకు వెళ్లి తిరుగు ప్ర...