భారతదేశం, మార్చి 6 -- Tiger Fear: జయశంకర్‌ జిల్లా భూపాలపల్లి జిల్లాలోని గోరికొత్తపల్లి మండల కేంద్రంలో మొక్క జొన్న చేను వద్ద పులిని గమనించి స్థానిక రైతులు వీడియో తీసి పోస్టు చేశారని స్థానికులు పేర్కొంటున్నారు. పులి సంచారం వార్తతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతుండగా.. పొలాల వద్దకు వెళ్లాలంటే రైతులు జంకుతున్నారు. చేను వద్దకు ఒంటరిగా కాకుండా గుంపులుగుంపులుగా వెళ్తున్నారు.

గోరికొత్తపల్లిలో పులి తిరుగుతున్న విషయంపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పులికి సంబంధించిన వీడియో ఇక్కడిది కాదని, ఎక్కడిదో వీడియోను కావాలనే గోరికొత్తపల్లికి సంబంధించిందంటూ వాట్సాప్ గ్రూపుల్లో తిప్పుతున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. పులి సంచారం అంతా తూచ్ అంటూ కొట్టి పడేస్తున్నారు.

గోరికొత్తపల్లి మండల కేంద్రంలో పులి సంచరిస్తుందని గ్రామస్...