Hyderabad, మార్చి 28 -- పిల్లలకు చక్కిలిగింతలు పెట్టి నవ్వించడం అనేది ప్రతి ఇంట్లో జరిగేది. చిన్నపిల్లలకి ఇలా ఎక్కువగా కితకితలు పెడుతూ ఉంటారు. అయితే నిపుణులు చెబుతున్న ప్రకారం ఇది మంచి అలవాటు కాదు. మీకు తెలియకుండానే పిల్లలను బాధపెట్టే ఆట ఇది. కనీసం పిల్లలు కూడా అది బాధించే పని అని అర్థం చేసుకోలేరు. వారికి కూడా అది ఆనందంగానే ఉంటుంది. కానీ వారిలో ఎన్నో ఆరోగ్య సమస్యలు రావడానికి ఈ చక్కిలిగింతలు కారణం అవుతాయి.

పిల్లలకు కితకితలు పెట్టడం వల్ల అది నేరుగా మెదడులో ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతి ఒక్కరి మెదడులో ఒక చిన్న హైపోథాలమస్ అనే గ్రంధి ఉంటుంది. కితకితలు పెట్టినప్పుడు ఈ హైపోథాలమస్ గ్రంధిలో విపరీతమైన ప్రేరేపణలు కలుగుతాయి. ఆ ప్రేరేపణలు నేరుగా మెదడు మొదలు అంటే కాండం దగ్గర ప్రభావాన్ని చూపిస్తుంది.ఈ హైపోథాలమస్ గ్రంధి కూడా బాదంపప్పు ఆకారంలో అక్కడే ఉం...