Hyderabad, మార్చి 30 -- థైరాయిడ్ సమస్యను సాధారణంగా లక్షణాలను చూసి చెకప్ చేయించుకుంటారు. కానీ, అప్పటికే సమస్య ముదిరిపోయి ఉండొచ్చు. సమస్య తీవ్రత అంత పెరగకముందే కొద్దిపాటి అనుమానం ఉన్నా కూడా మెడను తాకి డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. ఎటువంటి సమస్య లేకపోవడం మంచిదే కానీ, ఏదైనా సమస్యగా ఉంటే మాత్రం ముందస్తు పరీక్షల కోసం ల్యాబొరేటరీకి వెళ్లడం బెటర్.

మెడ దిగువ భాగంలో, కాలర్ బోన్ పైన, వాయీస్ బాక్స్ కింద ఉండే ఈ గ్రంథి చిన్న సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఈ గ్రంథిలో గ్రోత్ నోడ్యూల్స్, గోయిటర్స్ వంటివి ఉంటే సమస్య మొదలవుతుంది. ఒక్కోసారి దీని తీవ్రత పెరిగి థైరాయిడ్ క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుంది.

సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథిలో మార్పులు సంభవిస్తే వాచినట్లుగా మారుతుంది. ఫలితంగా ఒక ముద్ద రూపంలో మారి మెడ పరిమాణంలో మార్పులు కనిపిస్తాయి. ఒకవేళ మీకు మెడ పర...