HYderabad, ఏప్రిల్ 3 -- కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక మనిషికి జీవితంలో మంచీ, చెడు అనే రోజులు వస్తూపోతూనే ఉంటాయి. కాలం ఎల్లప్పుడూ మంచిగా ఉండిపోవడం, లేదా పూర్తిగా చెడ్డగా ఉండిపోవడం జరగదు. అది కచ్చితంగా మారుతుంది. అందుకే ప్రతి పరిస్థితిలోనూ ఓపికగా ఉండాలి.

ఒక పురాతన కథ ప్రకారం ఒక రాజు తన రాజ్యంలో ఉన్న ఒక సాధువు కలవడానికి వస్తాడు. సాధువును తన రాజభవనానికి వచ్చి విందును స్వీకరించవని కోరుతాడు. దానికి సాధువు ఒప్పుకుంటాడు.

మరుసటి రోజు సాధువు రాజభవనానికి వస్తాడు. రాజు అతనికి ఎంతో సేవ చేస్తాడు. ఒక పెద్ద రాజ్యానికి చక్రవర్తి అయినప్పటికీ ఎలాంటి అహంకారం లేకపోవడం సాధువుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. రాజభవనాన్ని వీడి వెళ్లే ముందు రాజుకు ఒక తాయెత్తును ఇస్తాడు. ఆ తాయెత్తులో ఒక కాగితంపై మంత్రాన్ని రాసి పెట్టానని చెబుతాడు. అయితే మంచి రోజుల్లో మాత్రం ఆ తాయెత్తు...