Hyderabad, మార్చి 6 -- చిన్న సమస్యకి అల్లాడిపోతూ విలవిల్లాడి పోయేవారు ఈ భూమిపై ఎంతోమంది ఉన్నారు. వారంతా కూడా కేవలం మనుషులే. జంతువులేవి కూడా తనకొచ్చిన కష్టాన్ని చూసి పొరలి పొరలి ఏడవవు. తలుచుకొని తలుచుకొని కుమిలి పోవు. ఆ క్షణాన్ని అక్కడే వదిలేసి ముందడుగు వేస్తాయి. జీవితంలో మరిన్ని మజిలీలను వెతుక్కుని ముందుకు సాగుతాయి. కానీ మనిషి మాత్రం కష్టం రాగానే అక్కడే ఆగిపోతాడు. కుమిలి కుమిలి ఏడుస్తూ ముందడుగు వేయడు.

ఒక ఊరిలో ఒంటరిగా జీవిస్తున్న రాము అనే యువకుడు ఉన్నాడు. అతడికి ప్రతిరోజూ అడవిలోకి వెళ్లడం అలవాటు. అక్కడ ఉన్న చెట్లను, జంతువులను, పక్షులను చూసి చాలా ఆనందపడేవారు. అవి కలిసిమెలిసి జీవించడం అతనికి నచ్చేది. తనకి చిన్న కష్టం వచ్చినా కూడా చూసేవారు లేరని తెగ బాధపడేవాడు. అదే ఏ పక్షిగానో, జంతువుగానో పుడితే బాగుండేమో అనుకునేవాడు. అడవిలో అన్ని జీవులతో క...