Hyderabad, మార్చి 20 -- ఒక పెద్ద అడవి ఉండేది. అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టును ఆసరా చేసుకుని పక్షులు, పిల్లి, ఎలుకలు వంటివి కలిసి నివసించేవి. పక్షులు చెట్టు కొమ్మల్లో గూడుకట్టుకొని నివసిస్తూ ఉంటే, ఆ చెట్టు తొర్రలో పిల్లి ఉండేది. ఇక చెట్టు కింద బొరియలు చేసుకుని ఎలుకలు నివసించేవి. అలా ఈ మూడు జాతులు కొన్నిళ్లుగా కలిసిమెలిసి జీవించసాగాయి.

అవకాశం వచ్చినా కూడా పిల్లి ఎలుకలను తినేది కాదు. అలాగే పక్షుల జోలికి కూడా వెళ్ళేది కాదు. పైగా అవన్నీ ప్రాణ స్నేహితులుగా మారిపోయాయి. ప్రపంచంలో ఎక్కడా జరగని వింతే ఇది. పిల్లి, ఎలుక, పక్షులు స్నేహం చేయడం అనేది అతిపెద్ద విషయమనే చెప్పుకోవాలి. అందుకే ఈ స్నేహితులన్నీ తమ గురించి బయట ప్రపంచానికి తెలియాలని కోరుకున్నాయి.

అలా అనుకున్నప్పుడు నుంచి పిల్లి, ఎలుకలు, పక్షులు కలిసే వంట చేసుకోవడం కలిసే తినడ...