Hyderabad, మార్చి 27 -- వాయిదా వేయడం అనేది చిన్న సమస్యగా కనిపిస్తుంది. నిజానికి అదొక పెద్ద రోగం అని అనుకోవాలి. ఇప్పుడు చేయాల్సింది, సాయంత్రం చేద్దామనుకుంటారు. సాయంత్రం చేయాల్సింది మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. పోనీ మరుసటి రోజు అయినా చేస్తారా అంటే... అలా వారు ఒక వారం రోజులు పాటు వాయిదా వేస్తూనే ఉంటారు. అందుకే దీన్ని అలవాటు అనరు... రోగమనే పిలుస్తారు. ఇలా వాయిదా రోగం ఉన్నవారు తమను తామే వెనక్కి లాక్కుంటూ వెళతారు. రెండు అడుగుల ముందుకు వేయాల్సింది... పది అడుగులు వెనక్కి వేస్తూ పోతారు. వాయిదా వేసే అలవాటును వెంటనే వదలకపోతే మీకు వెనుకబాటే గాని ముందుకెళ్లే అవకాశం ఉండదు.

మీరు ఒక పనిని వాయిదా వేస్తున్నారు అంటే... సమయాన్ని వృధా చేస్తున్నారని అర్థం. సమయం వృధా అయితే తిరిగి రాదు. సమయాన్ని వృధా చేసే వ్యక్తి విజేతగా నిలవడం కూడా కష్టమే. ఈరోజు కాకపోతే రేపు...