Hyderabad, ఏప్రిల్ 10 -- ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహానికి ఎంతో విలువ ఉంటుంది. నర్సరీ క్లాసు నుంచే ఇప్పుడు స్నేహాలు మొదలైపోతాయి. బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మన జీవితంలోని ప్రతి దశలో ఎవరో ఒకరు స్నేహితులు అవుతూనే ఉంటారు. కష్టసుఖాల్లో ఆ స్నేహితులు సహాయం చేయడం మనం చూస్తూనే ఉంటాం.

ప్రతి స్నేహం మనసుకు హత్తుకునేంత దగ్గరగా ఉండదు. కానీ కొంతమంది మాత్రం మనకు ఎంతో దగ్గరవుతారు. కొంతమంది స్నేహితులు భావోద్వేగ పరంగా కూడా మీ మనసులో చోటు సంపాదిస్తారు. అయితే కొంతమంది స్నేహితులు మాత్రం స్నేహం ముసుగులో మీకు శత్రువుల్లా ప్రవర్తిస్తారు. వారిని సమయానికి గుర్తించడం చాలా ముఖ్యం.

గడ్డిలో దాక్కున్న పాములాగా వీరు స్నేహం ముసుగులో మీతో పాటు ఉంటారు. కానీ వారి వల్ల మీకు ఎప్పటికైనా చెడే జరుగుతుంది. అలాంటి స్నేహితులను గుర్తించి దూరంగా ఉంచాలి. ఎలాంటి స్నేహితులు మీ జీవితంల...