Hyderabad, ఏప్రిల్ 19 -- Kamal Haasan Thug Life OTT Rights: లోక నాయకుడు కమల్ హాసన్‌కు ఉన్న క్రేజ్ తెలిసిందే. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. విక్రమ్ వంటి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయన భారతీయుడు 2 మూవీతో డిజాస్టర్ అందుకున్నారు.

ఇక ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీలో విలన్‌గా నటించి అదరగొట్టారు. ఇప్పుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ సినిమా థగ్ లైఫ్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్-మణిరత్నం కాంబినేషన్‌లో సినిమా అనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి.

అంతేకాకుండా, థగ్ లైఫ్ మూవీలో తమిళ స్టార్ హీరో శింబు, అగ్ర కథానాయిక త్రిష, మరో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ వంటి స్టార్ క్యాస్ట్ ఉంది. దీంతో సినిమాపై మరింత ఎక్స్‍‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే...