Hyderabad, ఏప్రిల్ 22 -- Thudarum: మలయాళం సినిమాలను ఆదరించే వాళ్లలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందే ఉంటారు. ఆ ఇండస్ట్రీ కంటెంట్ ను ఓటీటీలో తెగ చూస్తారు. అయితే ఇదే అలుసుగా తీసుకొని అక్కడి మేకర్స్ తమ సినిమాలను ఇష్టం వచ్చినట్లుగా డబ్ చేసి వదులుతున్నారు. అలా తాజాగా వస్తున్న మరో మూవీ తుడరుమ్ (Thudarum). అసలు ఈ పదమే ఎప్పుడూ వినని తెలుగు ప్రేక్షకులు అర్థమేంటో తెలియక బిక్కమొహాలు వేస్తున్నారు.

మలయాళం సినిమాలను ఆదరిస్తున్నారు కదా అని అక్కడి మూవీస్ అన్నింటినీ డబ్ చేసి వదలడం వరకూ బాగానే ఉంది. కానీ అలా తీసుకొచ్చే సమయంలో కనీసం టైటిల్ అయినా ఇక్కడి ప్రేక్షకులకు అర్థమయ్యేలా పెడితే బాగుంటుంది. ఈ విషయంలో అక్కడి మేకర్స్ కు, ఇక్కడి డబ్బింగ్ హక్కులు పొందిన వారికి అసలు పట్టింపే లేనట్లుగా కనిపిస్తోంది. దీనికి తాజా ఉదాహరణ మోహన్ లాల్ నటించిన తుడరుమ్ మూవీయే.

శోభ...