Hyderabad, మార్చి 10 -- మారుతున్న వాతావరణం వల్ల లేదా తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కొందరు తరచుగా గొంతు నొప్పి సమస్య బారిన పడుతూ ఉంటారు. ఇది వినేందుకు చిన్న సమస్య అయినా, అది పెట్టే బాధ మాత్రం ఎక్కువే. అయితే ఈ సమస్య కూడా రెండు మూడు రోజుల్లోనే నయమవుతుంది. ఆ రెండు మూడు రోజులు మాత్రం నరకంలా అనిపిస్తుంది. అయితే ఇన్ని హోం రెమెడీస్ పాటించి మందులు వాడినా ఈ నొప్పి తగ్గకపోతే కంగారుగా అనిపిస్తుంది.

గొంతు నొప్పి రావడానికి అనేక ఇతర కారణాలు ఉండవచ్చు. చాలాసార్లు ఈ నొప్పి క్కువగా ఉంటుంది, ఆహారం తినడానికి ఇబ్బంది పడుతుంది. గొంతు నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కింద ఇచ్చిన కారణాల్లో ఏదో ఒక దాని వల్ల గొంతు నొప్పి రావచ్చు.

గొంతు నొప్పికి వైరస్ చాలా సాధారణ కారణం. వైరల్ ఇన్ఫెక్షన్ గొంతు దిగువ భాగంలో నొప్పిని కలిగిస్తుంది. మీకు వైరల్ ఇన్ఫెక్షన...