భారతదేశం, మార్చి 13 -- ఐశ్య‌ర్య రాజేష్ హీరోయిన్‌గా న‌టించిన డ్రైవ‌ర్ జ‌మున మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన మూడేళ్ల త‌ర్వాత మ‌రో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్ప‌టికే ఆహా ఓటీటీలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం కేవ‌లం త‌మిళ వెర్ష‌న్ మాత్ర‌మే విడుద‌లైంది.

క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన డ్రైవ‌ర్ జ‌మున మూవీకి కిన్‌స్లిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2022లో రిలీజైన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. ఐశ్వ‌ర్య రాజేష్‌తో పాటు క‌థ‌లోని మ‌లుపులు ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్‌ను డైరెక్ట‌ర్ అద్భుతంగా రాసుకున్నాడు. రివేంజ్ థ్రిల్ల‌ర్‌గా రోడ్ జ‌ర్నీ బ్యాక్‌డ్రాప్‌లో ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించాడు.డ్రైవ‌ర్ జ‌మున మూవీలో ఐశ్వ...