భారతదేశం, ఫిబ్రవరి 16 -- Thriller OTT: వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన శ‌బ‌రి మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన తొమ్మిది నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. 99 రూపాయ‌ల రెంట‌ల్‌తో రిలీజ్ చేశారు. ఇప్ప‌టికే ఈ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ స‌న్ నెక్స్ట్, ఆహా ఓటీటీల‌లో అందుబాటులో ఉంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

శ‌బ‌రి మూవీలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌తో పాటు గ‌ణేష్ వెంక‌ట్రామ‌న్‌, శ‌శాంక్, మైమ్‌గోపి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు అనిల్ కాట్జ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గోపీసుంద‌ర్ మ్యూజిక్ అందించాడు.

గ‌త ఏడాది మే నెల‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన శ‌బ‌రి మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ యాక్టింగ్ బాగుంద‌నే టాక్ వ‌చ్చిన‌......