భారతదేశం, మార్చి 6 -- Thriller OTT: మ‌ల‌యాళం మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ది సీక్రెట్ ఆఫ్ ఉమెన్ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. స‌న్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విష‌యాన్ని స‌న్ నెక్స్ట్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. ఈ థ్రిల్ల‌ర్ మూవీకి ప్ర‌జేస్ సేన్ ద‌ర్శ‌క‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు.

ది సీక్రెట్ ఆఫ్ ఉమెన్ మూవీలో నిరంజ‌న అనూప్‌, అజు వ‌ర్గీస్‌, శ్రీకాంత్ ముర‌ళి కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇద్ద‌రు మ‌హిళ‌ల జీవితాల్లో చోటుచేసుకున్న అనూహ్య ప‌రిణామాల‌తో ద‌ర్శ‌కుడు ప్ర‌జేస్ సేన్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. జీనా అపార్టెమంట్‌లోకి అర్థ‌రాత్రి దొంగ‌చాటుగా వ‌స్తాడు సెంథిల్‌. జీనాతో సెంథిల్‌కు ఉన్న సంబంధం ఏమిటి?

త‌న మాజీ భ‌ర్త నుంచి జీనా ఎలాంటి వేధింపుల‌ను ఎదుర్కొన్న‌ది అన్న‌ది ఓ క‌థ‌. ఎల్డో సూసైడ్ చేసు...