భారతదేశం, ఫిబ్రవరి 14 -- మ‌ల‌యాళం మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ రేఖ చిత్రం ఓటీటీ రిలీజ్ మ‌రింత ఆల‌స్యం కానుంది. ఫిబ్ర‌వ‌రిలోనే ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఓటీటీ ఫ్యాన్స్‌కు మేక‌ర్స్ ట్విస్ట్ ఇచ్చారు. థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల గ్యాప్ త‌ర్వాతే రేఖ చిత్రం మూవీని ఓటీటీలోకి తీసుకురావాల‌ని ఫిక్స‌య్యారు.

తాజాగా రేఖ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. మార్చి 14 నుంచి సోనీలివ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ హిందీ భాష‌ల్లో విడుద‌ల అవుతోన్న‌ట్లు స‌మాచారం. ఈ ఓటీటీ రిలీజ్ డేట్ పోస్ట‌ర్లు సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తోన్నాయి.

మిస్ట‌రీ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన రేఖ చిత్రం మూవీలో...