Hyderabad, ఏప్రిల్ 15 -- Thriller Movie: మలయాళం థ్రిల్లర్ సినిమాలంటే మీకు ఇష్టమా? అయితే ఈ మూవీ మీ కోసమే. పుష్ప మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ సినిమా పేరు ట్రాన్స్ (Trance). యూట్యూబ్ లో తెలుగులోనూ ఫ్రీగా అందుబాటులో ఉంది. ఐఎండీబీలో 7.3 రేటింగ్ ఉన్న సూపర్ హిట్ మూవీ ఇది.

మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన సూపర్ హిట్ థ్రిల్లర్ సినిమాల్లో ఈ ట్రాన్స్ (Trance) కూడా ఒకటి. 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫహాద్ ఫాజిల్ లీడ్ రోల్లో నటించాడు. అతని భార్య నజ్రియా నజిమ్ కూడా ఇందులో నటించడం విశేషం. ఈ మూవీ స్టోరీ కాస్త భిన్నంగా సాగుతుంది. అసలు దేవుడినే నమ్మని ఓ మోటివేషనల్ స్పీకర్.. తన సోదరుడు మరణించిన తర్వాత పాస్టర్ గా మారి తన మాయ మాటలతో ప్రజలను ఎలా మోసం చేస్తాడో ఈ మూవీలో మేకర్స్ చూపించే ప్రయత్నం చేశారు.

కన్యాకుమ...