భారతదేశం, ఏప్రిల్ 7 -- Thopudurthi Prakash Reddy : వైసీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎయిర్ పోర్టులో తోపుదుర్తి ఓ యువతితో భుజంపై చేయివేసి మాట్లాడుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుది. ఈ వీడియోను ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో తోపుదుర్తితో పాటు వీడియోలో ఉన్న యువతి స్పందించారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హీరోయిన్ సుమయా రెడ్డి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. గతంలో ఆమె తోపుదుర్తి కుటుంబంతో దిగిన ఫొటోలను తోపుదుర్తి ఎక్స్ లో పోస్టు చేశారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉన్న తమపై ప్రత్యర్థి పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు.

"నేను మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రేపటి రోజున రామగిరి మండలానికి వై.యస్ ...