భారతదేశం, ఫిబ్రవరి 6 -- తెలుగులో చేసింది త‌క్కువ సినిమాలే అయినా వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు తిరువీర్‌. మ‌సూద‌, ప‌రేషాన్ సినిమాల‌తో విజ‌యాల్ని అందుకున్న తిరువీర్ వెరైటీ కాన్సెప్ట్‌ల‌తో త‌దుప‌రి సినిమాలు చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం తెలుగులో తిరువీర్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, భ‌గ‌వంతుడుతో పాటు మ‌రో సినిమాలో న‌టిస్తోన్నాడు.

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీలో ఫొటోగ్రాఫర్ క్యారెక్ట‌ర్‌లో తిరువీర్ క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమా కాన్సెప్ట్‌తో పాటు త‌న క్యారెక్ట‌ర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయ‌ని తిరువీర్ అన్నాడు. "మొబైల్‌తో చాలాసార్లు ఫోటోలు తీశాను. కానీ ఇలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా నటించడం చాలా కొత్తగా, ఛాలెంజింగ్‌గా అనిపిస్తోంద‌ని తిరువీర్ చెప్పాడు. ఫొటోగ్రాఫ‌ర్ క్యారెక్ట‌ర్ కోసం కెమెరా స్టిల్స్ ఎలా పెట్టించాలి? కెమెరాను ఎలా పట్టుకో...