భారతదేశం, ఫిబ్రవరి 5 -- దొంగతనం చేయగా వచ్చిన డబ్బుతో ఓ వ్యక్తి తన ప్రియురాలికి మూడు కోట్లు పెట్టి ఇల్లు కొనిచ్చాడు. ఇప్పుడు ఈ విషయం తెలిసి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనాలు వామ్మో అనుకుంటున్నారు. ఈ దొంగను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రెండు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా అనేక దొంగతనాలకు పాల్పడిన మహారాష్ట్రకు చెందిన 37 ఏళ్ల దొంగను బెంగళూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ అరెస్టును బెంగళూరు పోలీస్ కమిషనర్ బి.దయానంద ధృవీకరించారు. అరెస్టయిన నిందితుడిని మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందిన పంచాక్షరి ఎస్ స్వామిగా గుర్తించారు. జనవరి 9న బెంగళూరులోని మారుతీ నగర్ లోని ఓ ఇంట్లో రూ.14 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించిన కేసులో అరెస్టయ్యాడు.

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు 200కు పైగా సీసీ కెమెరాల ఫుటేజీలన...