భారతదేశం, మార్చి 14 -- The Smile Man Review: కోలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ శ‌ర‌త్‌కుమార్ హీరోగా న‌టించిన ది స్మైల్ మ్యాన్ తెలుగులో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ సైకో కిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీకి శ్యామ్‌, ప్ర‌వీణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీ ఎలా ఉందంటే?

చిదంబ‌రం నెడుమార‌న్ (శ‌ర‌త్ కుమార్‌) నిజాయితీ ప‌రుడైన పోలీస్ ఆఫీస‌ర్‌. స్మైల్ మ్యాన్ అనే సీరియ‌ల్ కిల్ల‌ర్‌ను ప‌ట్టుకొనే ప్ర‌య‌త్నంలో తీవ్రంగా గాయ‌ప‌డ‌తాడు. అల్జీమ‌ర్స్ స‌మ‌స్య కార‌ణాల త‌న జ్ఞాప‌క‌శ‌క్తిని మెళ్లిమెళ్లిగా కోల్పోతుంటాడు. చాలా కాలం క్రిత‌మే ఎన్‌కౌంట‌ర్‌లో చ‌నిపోయాడ‌నుకున్న స్మైల్ మ్యాన్ వైజాగ్‌లో మ‌ళ్లీ హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతుంటాడు. ఈ సీరియ‌ల్‌ కిల్ల‌ర్‌ను ప‌ట్టుకోవ‌డానికి అర‌వింద్ అనే పోలీస్ ఆఫీస‌ర్ రంగంలోకి దిగుతాడు.

ఈ కేసును సాల్వ్ చేయ‌డంలో చిదంబ‌రం సాయం కోరుతాడు అ...