భారతదేశం, మార్చి 16 -- 'ది రాజా సాబ్' చిత్రంపై హైప్ విపరీతంగా ఉంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఈ మూవీ ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ తొలిసారి హారర్ కామెడీ జానర్ సినిమా చేస్తుండటంతో హైప్ మరింత ఎక్కువగా ఉంది. మారుతీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వింటేజ్ ప్రభాస్ కనిపిస్తారనే టాక్ ఉంది. ఏప్రిల్ 10వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే, ఆ తేదీ నుంచి వాయిదా పడడం ఖాయమైంది. దీంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయితే, ది రాజాసాబ్ మూవీ రిలీజ్ ప్లాన్‍ను మేకర్స్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

'ది రాజాసాబ్' చిత్రాన్ని ఆగస్టు నెల మధ్యలో విడుదల చేయాలని టీమ్ నిర్ణయించిందని సమాచారం బయటికి వచ్చింది. ఆగస్టు 15వ తేదీని పరిశీలిస్తున్నట్టు రూమర్లు బయటికి వచ్చాయి. ఆగస్టు రిలీజ్ అంటూ త్వరలోనే అధికారిక ప్రక...