భారతదేశం, మార్చి 3 -- నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‍లో రానున్న 'ది ప్యారడైజ్' చిత్రంపై మొదటి నుంచి విపరీతమైన ఆసక్తి ఉంది. ఫస్ట్ లుక్ నుంచి ఈ చిత్రం అంచనాలను పెంచేసింది. దసరాతో బ్లాక్‍బస్టర్ కొట్టిన నాని - శ్రీకాంత్ కాంబో మరోసారి ఈ చిత్రంతో రిపీట్ అవుతోంది. ఇంతటి హైప్ నెలకొన్న ది ప్యారడైజ్ మూవీ నుంచి నేడు (మార్చి 3) గ్లింప్స్ వీడియో వచ్చేసింది. పవర్‌ఫుల్‍గా ఈ గ్లింప్స్ ఉంది.

ది ప్యారడైజ్ గ్లింప్స్ పవర్‌ఫుల్ డైలాగ్‍లు, ఇంటెన్స్ విజువల్స్, నాని డిఫరెంట్ గెటప్‍తో అదిరిపోయింది. కాకుల రిఫరెన్సుతో అణచివేతకు గురైన ఓ వర్గం గురించి, వారి కోసం పోరాడేందుకు వచ్చిన నాయకుడి గురించి చెబుతూ ఈ గ్లింప్స్ సాగింది. "చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాసిండ్రు కానీ.. అదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే" అంటూ ఫీమేల్ వాయి...