Hyderabad, మార్చి 27 -- Nani Srikanth Odela The Paradise Release In 365 Days: నేచురల్ స్టార్ నాని అటు హీరోగా ఇటు నిర్మాతగా వరుసపెట్టి హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే కోర్ట్ సినిమాను సమర్పించిన నాని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అలాగే, త్వరలో హిట్ 3 ది థర్డ్ కేస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేయనున్నాడు.

అంతకుముందు హీరోగా దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో వరుసగా హిట్లు అందుకున్నాడు. ఇప్పుడు హిట్ 3 సినిమాతో పాటు ది ప్యారడైజ్ సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు నాని. దసరాతో రా అండ్ రస్టిక్ హిట్ కొట్టిన నాని మరోసారి అదే మూవీ దర్శకుడి సినిమాలో నటించాడు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని చేస్తున్న సినిమానే ది ప్యారడైజ్ మూవీ.

నాని, శ్రీకాంత్ ఓదేల కాంబినేషన్‌లో దసరా తర్వాత వస్తున్న రెండో సినిమా ఇది. ఇదివరకు రిలీజ్ అయిన ద...