Hyderabad, ఫిబ్రవరి 7 -- The Greatest Rivalry: India vs Pakistan Review: ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. క్రికెట్ ఫీల్డ్ లో ఈ పదం తరచూ వినే ఉంటారు. ఇదే టైటిల్ తో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోకి ఓ డాక్యుమెంటరీ వచ్చింది. ఈ దాయాదుల మధ్య క్రికెట్ ఫీల్డ్ లో జరిగే యుద్ధాన్ని అభిమానులే కాదు క్రికెటర్లు కూడా ఎలా ఓ నిజమైన యుద్ధంలాగే చూస్తారో ఈ డాక్యుమెంటరీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేకర్స్ చేశారు.

ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఎందుకంత పాపులర్? క్రికెట్ లో యాషెస్ ను మించిన క్రేజ్ ఎందుకు? రెండు దేశాల మధ్య ఉన్న శతృత్వం, రాజకీయాలు దానికి కారణం కావచ్చు. కానీ ఇండోపాక్ క్రికెట్ వార్ గ్రేటెస్ట్ రైవల్రీ ఎందుకు అయిందన్న మూలాల్లోకి ఈ డాక్యుమెంటరీ వెళ్లలేదు.

అయితే క్రికెట్ అభిమానులకు కావాల్సిన మసాలాను జోడించడానికి...