Hyderabad, జనవరి 28 -- The Family Man 3: ఓటీటీలో వచ్చిన బెస్ట్ ఇండియన్ వెబ్ సిరీస్ లో ఒకటైన ఫ్యామిలీ మ్యాన్ త్వరలోనే మూడో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలుసు కదా. తెలుగు డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ మూడో సీజన్లో ప్రముఖ నటుడు జైదీప్ అహ్లావత్ విలన్ పాత్ర పోషించనున్నట్లు పుకార్లు వస్తున్నాయి. అయితే అది పుకారు కాదు నిజమే అని ఇప్పుడా నటుడే కన్ఫమ్ చేయడం విశేషం.

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఇప్పటి వరకూ ఇండియన్ ఓటీటీలో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ లలో ఒకటి. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్.. మూడో సీజన్ తో రానుంది. ఇందులో తాను కూడా నటించినట్లు జైదీప్ అహ్లావత్ చెప్పాడు.

న్యూస్ 24తో మాట్లాడిన అతడు.. ఇది పుకారు కాదు నిజమే అని అనడం విశేషం. ఈ మధ్యే అతడు పాతాళ్ లోక్ సీజన్ 2 ద్వారా ప్రేక్షకుల...