Hyderabad, ఆగస్టు 2 -- Tharun Bhascker Casting Call: ఓ జంటకు విడాకులు ఇప్పించడానికి నటీనటులు కావాలట. అవును మీరు విన్నది నిజమే. ఓ డివోర్స్ నోటీస్ రూపంలో తరుణ్ భాస్కర్, వేణు ఉడుగుల మూవీ కోసం క్యాస్టింగ్ కాల్ ఉండటం విశేషం. ఈ ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్లు నిర్మిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు వంశీ రెడ్డి దొండపాటి డైరెక్ట్ చేస్తున్నాడు.

తెలంగాణ నేపథ్యం, గ్రామీణ వాతావరణంలో వస్తున్న సినిమాల సంఖ్య ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. అలాంటిదే ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. దర్శకులు తరుణ్ భాస్కర్, వేణు ఉడుగుల కాంబో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను ఓ విడాకుల నోటీసులో అనౌన్స్ చేస్తూ.. ఇందులో నటించేందుకు యువ నటీనటులు కావాలని మేకర్స్ పిలుపునివ్వడం విశేషం.

ఇడుపు కాయితం అంటూ పక్కా తెలంగాణ యాసలో డివోర్స్ నోటీస్ పై ఈ క్యాస్టింగ్ కాల్...