Hyderabad, జనవరి 28 -- Thandel Trailer: తండేల్ అంటే లీడర్.. అంటూ మోస్ట్ అవేటెడ్ మూవీ ఆఫ్ ఇయర్ తండేల్ ట్రైలర్ వచ్చేసింది. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి తీసుకొస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

నాగ చైతన్య తండేల్ మూవీ ట్రైలర్ మంగళవారం (జనవరి 28) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. వైజాగ్ లోని రామా టాకీస్ రోడ్ లో ఉన్న శ్రీరామా పిక్చర్ ప్యాలెస్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఈవెంట్ ప్రారంభం అయింది.

నిజానికి సాయంత్రం 6.03 గంటలకు ట్రైలర్ రావాల్సి ఉన్నా.. గంట ఆలస్యంగా వచ్చింది. అయితే ట్రైలర్ మాత్రం అభిమానుల అంచనాలను తగినట్లుగానే సాగింది. చైతూ, సాయి పల్లవి మధ్య కెమెస్ట్రీ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ ఇద్దరి నోటా ఉత్తరాంధ్ర య...