Hyderabad, జనవరి 27 -- Thandel Songs: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్ మూవీ రిలీజ్ కు ముందే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నుంచి వచ్చిన మూడు పాటలూ యూట్యూబ్ లో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాయి. తాజాగా ఈ మూడూ కలిపి 100 మిలియన్ల వ్యూస్ మార్క్ దాటినట్లు మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.

తండేల్ మూవీ నుంచి ఇప్పటికే మూడు సాంగ్స్ రిలీజ్ అయిన సంగతి తెలుసు కదా. బుజ్జి తల్లి, నమో నమ: శివాయ, హైలెస్సో హైలెస్సా సాంగ్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ మూడు పాటలూ కలిపి 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం.

ఈ విషయాన్ని సోమవారం (జనవరి 27) మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. "10 కోట్ల వ్యూస్.. బ్లాక్‌బస్టర్...