భారతదేశం, ఫిబ్రవరి 7 -- Thandel Review: ఈ ఏడాది తెలుగు ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూసిన సినిమాల్లో తండేల్ ఒక‌టి. ల‌వ్ స్టోరీ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ మూవీకి చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దేశ‌భ‌క్తికి, ప్రేమ‌క‌థ‌ను జోడించి రూపొందిన ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తండేల్ మూవీ ఎలా ఉంది? నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జోడి మెప్పించారా? లేదా? అంటే?

రాజు (నాగ‌చైత‌న్య‌), స‌త్య (సాయిప‌ల్ల‌వి) చిన్న‌నాటి నుంచి క‌లిసి పెరుగుతారు. స్నేహంతో మొద‌లైన వారి జ‌ర్నీ ప్రేమ‌గా మారుతుంది. రాజు వార‌స‌త్వంగా వ‌చ్చిన మ‌త్స్య‌కార వృత్తిలో కొన‌సాగుతుంటాడు. చేప‌ల వేట కోసం ఏడాదిలో తొమ్మిది నెల‌లు స‌ముద్రంపైనే ఉంటాడు.ఆ తొమ్మిది నెల‌లు రాజు కోసం ఎదురుచూస్తూ బ‌తికేస్తుంది స‌త్య‌.

చేప‌ల వేట‌కు వెళ్లిన రాజుకు ఏం జ‌రుగుతుం...