భారతదేశం, ఫిబ్రవరి 7 -- తండేల్ చిత్రం మంచి అంచనాలతో నేడు (ఫిబ్రవరి 7) థియేటర్లలోకి అడుగుపెట్టింది. యువ సామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన విదాముయర్చి గురువారం (ఫిబ్రవరి 6) థియేటర్లలో రిలీజైంది. తెలుగులో పట్టుదల పేరుతో ఈ చిత్రం వచ్చింది. ఈ రెండు సినిమాలకు రిలీజ్‍కు ముందే ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్ అయింది. ఆ వివరాలు ఇవే..

తండేల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. మంచి బజ్ ఉన్న ఈ చిత్రం కోసం రిలీజ్‍కు ముందు ఓటీటీ డీల్ జరిగింది. రూ.90కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందింది. అందులో 50 శాతానికిపైగా మొత్తంతోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ఈ చిత్రం హక్కులను దక్కించుకున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. ఇలా తండేల్ మూవీక...