Hyderabad, ఫిబ్రవరి 4 -- Thandel Movie Ticket Prices: నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్న తండేల్ మూవీ టికెట్ల ధరలు ఏపీలో పెరగనున్నాయి. ఈ మూవీ వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 7) రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. తెలంగాణలో దీనికి అవకాశం లేకపోవడంతో మేకర్స్ ఇక్కడి ప్రభుత్వాన్ని కోరలేదు. అయితే ఏపీలో మాత్రం వారం రోజుల పాటు టికెట్ల ధరలను పెంచుకోవడానికి అనుమతి లభించింది.

తండేల్ మూవీ కోసం టికెట్ల ధరలను పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ మంగళవారం (ఫిబ్రవరి 4) ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లలో ఒక్కో టికెట్ పై ధరలను రూ.50 చొప్పున, మల్టీప్లెక్స్ లలో రూ.75 చొప్పున పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ పెంపు తొలి వారం రోజుల పాటు ఉండనుంది.

శుక్రవారం (ఫిబ్రవరి 7) తండేల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ...