భారతదేశం, ఫిబ్రవరి 8 -- యువ సామ్రాట్ నాగచైతన్య, డ్యాన్సింగ్ క్వీన్ సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తండేల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ సాధించింది. మంచి హైప్ మధ్య ఈ చిత్రం ఈ శుక్రవారం (ఫిబ్రవరి 7) థియేటర్లలో రిలీజైంది. నిజజీవిత స్టోరీ ఆధారంగా ఈ మూవీని దర్శకుడు చందూ మెండేటి తెరకెక్కించారు. తండేల్ చిత్రానికి ఎక్కువ శాతం పాజిటివ్ టాకే వచ్చింది. హైప్ ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా జరిగాయి. దీంతో ఈ చిత్రానికి ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ దక్కాయి.

తండేల్ సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.16కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కినట్టు ట్రేడ్ అనలిస్టులు లెక్కకట్టారు. ఇండియాలోనే ఈ మూవీకి ఫస్ట్ డే రూ.10 కోట్ల నెట్ (సుమారు రూ.13కోట్ల గ్రాస్) కలెక్షన్లు దక్కినట్టు తెలుస్తోంది. మిగిలినది ఓవర్సీస్ ద్వారా వచ్చింది. కలెక్షన్లలో తెలుగులోన...