Hyderabad, ఫిబ్రవరి 10 -- Thandel Movie Box Office Collection Day 3: నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ఆదివారం (ఫిబ్రవరి 10) ఇండియా నెట్ కలెక్షన్స్ కాస్తా పెరిగాయి.

ఇండియాలో మొదటి రోజు తండేల్ సినిమా రూ. 11.5 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టగా.. రెండో రోజున రూ. 12.1 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో రోజున రూ. 12.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ సంస్థ పేర్కొంది. రెండో రోజుతో పోలిస్తే.. మూడో రోజున భారతదేశంలో తండేల్ వసూళ్లు కాస్తా పెరిగినట్లుగా కనిపిస్తోంది. ఈ లెక్కన ఇండియాలో 3 రోజుల్లో తండేల్ సినిమాకు 35.85 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ వెబ్ సైట్ పేర్కొంది.

ఇక చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జోడీ కట...