భారతదేశం, ఫిబ్రవరి 8 -- Thandel Movie: నాగ‌చైత‌న్య, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తండేల్ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఓ మ‌త్య్స‌కారుడి ప్రేమ‌క‌థ‌కు దేశ‌భ‌క్తిని జోడించి ద‌ర్శ‌కుడు చందూ మొండేటి తండేల్ మూవీని తెర‌కెక్కించాడు. తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ 21.27 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు చిత్ర వ‌ర్గాలు వెల్ల‌డించాయి. నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా తండేల్ నిలిచింది.

నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి యాక్టింగ్‌, వారిద్ద‌రి కెమిస్ట్రీతో పాటు దేవిశ్రీప్ర‌సాద్ పాట‌లు, బీజీఎమ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తోన్నాయి. పాకిస్థాన్ కోస్ట్‌గార్డుల‌కు దొరికి జైలు శిక్ష‌ను అనుభ‌వించిన కొంద‌రు మ‌త్య్స‌కారుల జీవితాల ఆధారంగా తండేల్ సినిమాను రూపొందించిన‌ట్లు ప్ర‌మోష‌న్స్‌లో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వెల్ల‌డించారు. ఈ ...