భారతదేశం, ఫిబ్రవరి 2 -- నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ కానుంది. యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించారు. శ్రీకాకుళం మత్య్సకారుడి నిజజీవిత కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. పాటలు, ట్రైలర్ తర్వాత తండేల్ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రమోషన్లను మూవీ టీమ్ జోరుగా చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చందూ మొండేటి పాల్గొన్నారు. ఆయన చేసిన ఓ కామెంట్ వైరల్ అవుతోంది.

తండేల్ చిత్రాన్ని మళ్లీమళ్లీ చూడాలని ప్రేమికులకు అనిపించకపోతే తాను పేరు మార్చుకుంటానని డైరెక్టర్ చందూ మొండేటి చెప్పారు. తాను కమర్షియల్ హిట్ గురించి ఇలా అనడం లేదని అన్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ కామెంట్ చేశారు.

ప్రేమలో ఉన్న వారికి తండేల్ చిత్రాన్ని మళ్లీ చూడాలని అనిపిస్తుందని చందూ చెప...