Hyderabad, జనవరి 27 -- Thandel Trailer Prelude: తండేల్ మూవీ ట్రైలర్ రిలీజ్ కు అంతా సిద్ధమైంది. సోమవారం (జనవరి 27) ఈ సినిమా ట్రైలర్ గ్లింప్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన మేకర్స్.. ట్రైలర్ ను మంగళవారం రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. అదే సమయంలో ఎంతో మందిని వేధిస్తున్న ప్రశ్న అసలు తండేల్ అంటే ఏంటి అన్నదానికి కూడా సమాధానం చెప్పబోతున్నారు.

నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఆఫ్ 2025 తండేల్. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అయితే ఇప్పటికే మూడు సాంగ్స్ రిలీజ్ చేయడం ద్వారా మేకర్స్ మూవీ ప్రమోషన్లను మొదలుపెట్టగా.. మంగళవారం (జనవరి 28) ట్రైలర్ కూడా రాబోతోంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లోని రామా టాకీస్ రోడ్ లో ఉన్న శ్రీరామా పిక్చర్ ప్యాలెస్ లో జరగనుంది. సాయంత్రం ...