Hyderabad, ఫిబ్రవరి 3 -- Thandel IMDb: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మూవీ తండేల్ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 7) రిలీజ్ కానుండగా.. ఐఎండీబీ ఇండియా ఎక్కువ మంది ఎదురు చూస్తున్న సినిమాలు, షోలలో నంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు మూవీ టీమ్ సోమవారం (ఫిబ్రవరి 3) వెల్లడించింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై నాగ చైతన్య కూడా భారీ ఆశలే పెట్టుకున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ పల్స్ పట్టుకునే సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్). వివిధ అంశాలపై పోల్స్ నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా ఇండియాలో ఎక్కువ మంది ఎదురు చూస్తున్న సినిమాల జాబితాను రిలీజ్ చేయగా.. అందులో తండేల్ తొలి స్థానంలో ఉన్నట్లు మూవీ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది.

"ఓ అతిపెద్ద అల తీరాన్ని తాకడాన్ని చూసేందుకు ప్రేక్షక...