Hyderabad, జనవరి 30 -- Thandel Director: రాజమౌళిని దేవుడిగా ఆరాధించే వాళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మందే ఉంటారు. తాజాగా తండేల్ మూవీ డైరెక్టర్ చందూ మొండేటి కూడా జక్కన్నపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. అతని ఫొటో తమ ఇంట్లో దేవుళ్ల పటాల పక్కనే ఉంటుందని చెప్పాడు. రాజమౌళితోపాటు శంకర్, మణిరత్నం, సుకుమార్ అంటే తనకు ఎంతో ఇష్టమని చందూ చెప్పాడు.

కార్తికేయ, కార్తికేయ 2, సవ్యసాచిలాంటి సినిమాలతో హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి.. ఇప్పుడు నాగ చైతన్యతో తండేల్ మూవీ తీశాడు. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ అంతా ప్రమోషన్లలో బిజీగా ఉంది.

ఇందులో భాగంగా గలాటా తెలుగుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడాడు. రాజమౌళి, శంకర్, మణిరత్నం, సుకుమార్ లు తన జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగమని, వాళ్లు లేకపోతే తాను ...