భారతదేశం, ఫిబ్రవరి 11 -- Thandel Collections: నాగ‌చైత‌న్య తండేల్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కుమ్మేస్తోంది. నాలుగు రోజుల్లోనే ఈ మూవీ 73.20 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఈ మేర‌కు క‌లెక్ష‌న్స్‌తో కూడిన స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. సెకండ్ వీకెండ్ పూర్త‌య్యే లోగా ఈ మూవీ వంద కోట్ల మైలురాయిని దాటే అవ‌కాశం ఉన్న‌ట్లు పేర్కొన్నారు. సోమ‌వారం రోజు తండేల్ మూవీకి 10.83 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు చెప్పారు. నాగ‌చైత‌న్య కెరీర్‌లో హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబ‌ట్టిన మూవీగా తండేల్ రికార్డ్ క్రియేట్ చేసింది.

నాలుగు రోజుల్లోనే తండేల్ మూవీ 80 శాతానికిపైగా రిక‌వ‌రీ సాధించింది. ఇప్ప‌టికే నైజాం ఏరియాలో నాగ‌చైత‌న్య మూవీ బ్రేక్ ఈవెన్‌ను సాధించిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. నైజాం ఏరియాలో ప‌దిన్న‌ర కోట్ల వ‌ర‌కు ఈ సినిమా ప్రీ ...