Hyderabad, ఫిబ్రవరి 22 -- Thandel Box Office Collection 2nd Week: నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ రాబట్టింది. అయితే, తాజాగా రెండో వారం (ఫిబ్రవరి 20కి) పూర్తి చేసుకుంది తండేల్ చిత్రం. అయితే, మొదటి వారంతో పోలిస్తే సెకండ్ వీక్ సుమారుగా 77 శాతం తండేల్ కలెక్షన్స్ పతనం అయినట్లు ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ సంస్థ తెలిపింది.

చందూ మొండేటి దర్శకత్వం వహించిన తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా తండేల్ రెండవ వారంలో థియేటర్లలో భారీగా 77.13 శాతం వరకు ఆదాయం పడిపోయినట్లు చెప్పుకొచ్చింది. ఈ రెండో వారంలో తండేల్ మూవీకి రూ. 11.3 కోట్లు నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అదే మొదటి వారంలో రూ. 49.4 కోట్లు సంపాదించింది.

ఇక తండేల్ సాధించిన రెండవ వారం కలెక్షన్స్ లో థియేటర్లలో సంపాదించిన రూ. 11.30 కోట్ల ఇండియా నెట్...