Hyderabad, ఫిబ్రవరి 9 -- Thandel Movie Box Office Collection Day 2: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్స్‌గా మరోసారి నటించిన లవ్ అండ్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ తండేల్. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తండేల్ సినిమాకు కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు.

ఫిబ్రవరి 7న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయిన తండేల్ మూవీకి టాక్ బాగానే వస్తోంది. సినిమా బాగుందని, ముఖ్యంగా నాగ చైతన్య నటన అదిరిపోయిందని పలు రివ్యూలు తెలిపాయి. దేశభక్తి ఎలిమెంట్స్‌తో అందమైన ప్రేమకథను చూపించారని అంటున్నారు. దీంతో తండేల్ మూవికి బాక్సాఫీస్ కలెక్షన్స్ బాగుంటున్నాయి.

తండేల్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజున రూ. 8.54 కోట్ల షేర్, 13.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చ...