భారతదేశం, ఫిబ్రవరి 16 -- నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తండేల్ చిత్రం అదరగొడుతోంది. ఫిబ్రవరి 7న రిలీజైన ఈ మూవీ ఆరంభం నుంచి మంచి కలెక్షన్లతో సత్తాచాటుతోంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అందుకు తగ్గట్టే వసూళ్లను రాబడుతోంది. ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. తండేల్ సినిమా ఎట్టకేలకు ఓ ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది.

తండేల్ సినిమా 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (ఫిబ్రవరి 16) అధికారికంగా వెల్లడించింది. "బాక్సాఫీస్ దుళ్లకొట్టేశారు. థియేటర్లకు జాతర తెచ్చేశారు. బ్లాక్‍బస్టర్ తండేల్.. ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్ల గ్రాస్ దాటేసింది" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

నాగచైతన్య కాలర్ ఎగరేస్తున్న పోజ్‍తో రూ.100కోట్ల పోస్టర్ తీసుకొచ్చింది మూవీ టీమ్. 100కోట్ల...