భారతదేశం, ఫిబ్రవరి 12 -- తండేల్ చిత్రం అంచనాలను అందుకొని బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. సూపర్ ఓపెనింగ్ అందుకున్న ఈ చిత్రం.. వీక్‍డేస్‍లోనూ పట్టు నిలుపుకుంది. స్టడీగా కలెక్షన్లను రాబడుతోంది. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం గత వారం ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజైంది. రియల్ స్టోరీ స్ఫూర్తిగా డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన తండేల్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.

తండేల్ చిత్రం ఫస్ట్ వీకెండ్ దుమ్మురేపింది. భారీ కలెక్షన్లు సాధించింది. అయితే, వీక్‍డేస్ అయిన సోమవారం, మంగళవారాల్లోనూ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద స్టడీగా నిలిచింది. తండేల్ చిత్రం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.73.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని మూవీ టీమ్ వెల్లడించింది. ఐదో రోజైన మంగళవారం కూడా ఈ చిత్రానికి కలెక్షన్లు నిలకడగా...