Hyderabad, ఫిబ్రవరి 6 -- Thandel Team Guests To Saregamapa 16 Grand Finale: తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించే జీ తెలుగు ఈ ఆదివారం (ఫిబ్రవరి 9) మరింత వినోదం అందించేందుకు సిద్ధమైంది. ఆరంభం నుంచి మనసుని హత్తుకునే పాటలు, అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు పాపులర్ షో సరిగమప సీజన్​ 16‌‌- ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ గ్రాండ్​ ఫినాలేకు చేరుకుంది.

మట్టిలోని మాణిక్యాలను వెలికితీస్తూ అత్యంత ప్రేక్షకాదరణతో కొనసాగుతున్న సరిగమప 16 సీజన్​ చివరి అంకానికి చేరుకుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య గెస్ట్‌లుగా నాగచైతన్య, సాయిపల్లవి విచ్చేశారు. ఉత్కంఠగా సాగిన ఈ సరిగమప సీజన్ -16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ గ్రాండ్​ ఫినాలే ఫిబ్రవరి 9 ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు టీవీ ఛానెల్‌లో ప్రసారం కానుంది.

ఈ సీజన్​కి ప్రముఖ ...